అంశము : తెలుగు తెలుగు వికీపీడియాలో వ్యాస నిర్మాణక్రమం
పాఠ్య లక్ష్యం: తెలుగు వికీపీడియా లో ఒక వ్యాసము కూర్పు ఎలా ఉంటుంది, అందులోని ఉప శీర్షికలు, వర్గీకరణ, మూసలు మొదలైనవి తెలుసుకొంటారు.
ఈ పాఠములో -
వికీపీడియా – వ్యాసం పరిచయం
సెర్చ్ బాక్స్ లో వ్యాసం కోసం వెతకటం, చదువుట, వ్యాసంలోని వివిధ ఉప శీర్షికలు
వికీపీడియా మొదటి పేజీ
తెలుగు వికీపీడియాలో వ్యాసం పేరు తెలుగులో టైపు చెయ్యటం ఎలా ?
వ్యాసం పేరు వెతకండి
జాబితా నుండి మీకు కావాల్సిన వ్యాసం ఎంచుకోండి
వ్యాసం లో శీర్షికలు
వ్యాసం లో శీర్షికలు
వ్యాసం లో శీర్షికలు
వ్యాసంలో శీర్షికలు, ఇతర వివరాలు వ్యాసం గురించి తెలుసుకోవలసినవి
ఈ పాఠంలో మీరు నేర్చుకొన్న అంశాలు మరో సారి మీకోసం
వికీపీడియా వ్యాసం అంటే ఏమిటి?
ఒక వికీపీడియా వ్యాసం అనేది ఈ సైట్ లో ఒక పేజీ, దీని మీద ఎన్సైక్లోపీడిక్ సమాచారం ఉంది. ప్రతి వ్యాసానికి ఆర్టికల్ కు ఒక పరిధి ఉంటుంది, ఇది విశ్వసనీయ మూలాల ఆధారంగా, విషయ సారాంశాన్ని ఆ వికీ వ్యాసం లో పొందుపరచాలి.
వికీపీడియా వ్యాసం శీర్షిక అంటే ఏమిటి ?
ఒక వికీపీడియా వ్యాసం శీర్షిక అనేది వ్యాసం యొక్క కంటెంట్ పైన ప్రదర్శించబడే పెద్ద శీర్షిక, మరియు వ్యాసం యొక్క పేజీ పేరు మరియు URL కు ఆధారం ఈ శీర్షిక ద్వారా వ్యాసం గురించి ఏమి ఉంది అని క్లుప్తం గా తెలుసుకోవచ్చు
వికీపీడియా:శోధించడం / వెతకటం
వెతకటం అన్వేషణ అనగా సమాచారాన్ని త్వరగా పొందడానికి వెదికే సులువైన మార్గం. వికీపీడియాలో వెతకండి దగ్గర సమాచారము తెలుగు అక్షరాలలో టైపు కొట్టి (ఉదా: తెలుగు) భూతద్దం లాంటి బొమ్మ మీద లేక ఎంటర్ నొక్కండి. మీట నొక్కండి. ఇది వికీ వ్యాసము తెలుగు కు తీసుకు వెళుతుంది. అక్కడ తెలుగుకు సంబందించిన వ్యాసం చూడొచ్చు. ఒకవేళ వ్యాసము లేకపోతే, అన్వేషక యంత్రం పాఠ్య విషయాలలో వెతుకుతుంది. నేరుగా వెతకాలంటే ప్రత్యేక:అన్వేషణ వాడండి.
యాదృఛ్ఛిక పేజీ
ఏదో ఒక పేజీ చూడాలంటే, యాదృఛ్ఛిక పేజీ లింకును నొక్కండి. దాని వలన Random గా, అంటే నిర్దిష్టమైన గమ్యం లేకుండా, ఏదో ఒక పేజీ వస్తుంది
లిప్యంతీకరణ అంటే
ఇది తెలుగు వికీపీడియాలో తెలుగు అక్షరాలు ఎక్కువగా వాడే పద్దతి , గూగుల్ ఫుట్ , జీ బోర్డు వచ్చిన తరువాత దీని వాడకం తగ్గినది , అయితే ఇప్పటికీ చాలామంది తెలుగు వికీపీడీయాలో లిప్యంతరీకరణ గానీ , ఇన్స్క్రిప్ట్ అనే కీబోర్డు ఆధారిత పద్దతిని వాడుతున్నారు .ఇది వికీపీడియాలో భాగంగా ఉండటం వలన మనం వ్యాసం పేరు వెతుకుతున్నప్పడు ఆటోమేటిక్ గా సంబంధిత సూచనలు రావటం కొంత సౌలభ్యంగా ఉంటుంది . లిప్యంతరీకరణ అనేది ఫొనెటిక్ సారూప్యత ఆధారంగా ఒక రకమైన వ్రాత నుండి మరొకదానికి సరిపోల్చే పద్ధతిని సూచిస్తుంది. ఈ సాధనంతో, మీరు లాటిన్ అక్షరాల్లో టైప్ చేయాలి (ఉదా. a, b, c మొదలైనవి.), అవి లక్ష్య భాషలో సారూప్య ఉచ్ఛారణ ఉన్న అక్షరాలకు మార్చబడతాయి. ఉదాహరణకు ఖమ్మం అనిరాయటానికి Khammam అనిరాయాలి . వ్యాఖ్యానం అని రాయటానికి vyAkhyAnam అని టైప్చేయాలి ఆదే గూగుల్ క్రోమ్ తెలుగు ఇన్పుట్ అయితే vyakhyanam అని రాయవచ్చు.
వికీపీడియా లింకులు
వికీపీడియా వ్యాసాలకు ఒకదానికొకటి లింకులివ్వడం చాలా ముఖ్యం. వ్యాస విషయానికి సంబంధించిన ఇతర సమాచారం పొందేందుకు ఈ లింకులు ఎంతగానో ఉపయోగపడతాయి.లింకు ఇచ్చేటపుడు "ఒకవేళ నేను ఈ వ్యాసాన్ని చదివితే, ఈ లింకు నాకు ఉపయోగపడుతుందా" అని ప్రశ్నించుకోండి.
వికీపీడియా వర్గాలు
వ్యాసాన్ని దానికి సంబంఢించిన ఇతర వ్యాసాలతో కలిపి ఓ వర్గంలో చేర్చవచ్చు. [[వర్గం:]] అని టైపు చేసి, కోలను తరువాత వర్గం పేరును రాయండి.వర్గాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటే ఇతరులు ఈ వ్యాసాన్ని తేలిగ్గా కనుక్కోగలరు. ఉత్తమమైన పద్ధతి ఏంటంటే ఇలాంటి ఇతర వ్యాసాలు ఏ వర్గంలో ఉన్నాయో చూసి అదే వర్గంలోకి చేర్చడం.
వ్యాసంలో శీర్షికలు , ఉప శీర్షికలు ఎందుకు?
వ్యాసాన్ని విభాగాలుగా విభజించడానికి శీర్షికలను ఉపయోగపడతాయి వ్యాసాన్ని ఓ క్రమపద్ధతిలో అమర్చడానికి శీర్షికలు, ఉపశీర్షికలు ఉపయోగపడతాయి. వ్యాసంలో రెండు మూడు విషయాల గురించి రాస్తూ ఉంటే, వాటిని విభాగాలుగా విడగొట్టి ప్రత్యేక శీర్షికల కింద పెట్టవచ్చు
క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు
ఇది వికీలో ఉన్న వ్యాసాలకు , ఇందులో చేర్చ బడిన ఫోటోలు వంటి మీడియాకు వర్తించే ఒక లైసెన్సు దీని వలన మీరు వికీ మూలం పేర్కొంటూ ఇందులోని సమాచారం , మీడియా స్వేచ్ఛగా వాడుకోవచ్చు, పంచుకోవచ్చు, మెఱుగుపర్చవచ్చు.
వికీపీడియా: చర్చా పేజీ
మీరు వ్యాసం (లేదా పేజీ) గురించి మీ వ్యాఖ్యలను ఆ వ్యాసం యొక్క చర్చా పేజీలలో పోస్ట్ చేయవచ్చు. మీరు ఒక నిర్దిష్ట వినియోగదారుతో మాట్లాడాలనుకుంటే, మీరు మీ వ్యాఖ్యలను అతని చర్చా పేజీలో పోస్ట్ చేయవచ్చు
బయటి లింకులు
వికీపీడియాకు బయట ఉన్న సైట్లకు కూడా వికీపీడియా వ్యాసాల నుండి లింకులు ఇవ్వవచ్చు. అంతర్గత లింకులను ఎలా సృష్టిస్తామో వీటినీ అలాగే సృష్టించవచ్చు. మామూలుగా బయటి లింకులన్నిటినీ వ్యాసం చివర ఉండే బయటి లింకులు విభాగంలో పెట్టాలి. అంతర్గత లింకు పెట్టగలిగిన సందర్భాల్లో బయటి లింకును పెట్టకండి.
బయటి లింకు పెట్టినపుడు చిన్న వివరణ కూడా ఇస్తే బాగుంటుంది. ఈ వివరణ ఆ లింకు పేరుగా కనిపిస్తుంది. ఉదాహరణకు.. గూగుల్ సైటు. ఇలాంటి లింకును సృష్టించేందుకు, లింకును టైపు చేసి, ఒక స్పేసు తరువాత, పేరు రాయాలి. ఈ మొత్తాన్ని ఒక స్క్వేరు బ్రాకెట్ మధ్యన రాయాలి. పై లింకును ఇలా రాయాలి:
[http://www.google.com గూగుల్ సైటు]